అమరావతి :
గుంటూరులోని గుజ్జనగుండ్ల రోడ్లపై సోమవారం రాత్రి కొందరు యువకులు బైక్లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు.
వింత శబ్దాలు చేస్తూ, బైకులను స్కిడ్ చేస్తూ వాహనదారులను భయపెట్టారు.
కొందరు యువకులు ‘మమ్మల్ని ఆపేవారు లేరు’ అన్నట్లుగా వ్యవహరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొన్ని బైకులకు నంబర్ ప్లేట్లు కూడా లేవని తెలిసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి, యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.