CM Chandrababu Naidu: వైజాగ్కి గూగుల్ పెట్టుబడి రావడానికి కారణం శాంతి భద్రతలు: సీఎం చంద్రబాబు

క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని.. వారి కంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం.. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.

అక్టోబర్ 21: సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళగిరి APSP బెటాలియన్‍లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని.. చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని.. కుల మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ గా మారిందని అన్నారు. వ్యక్తిగత హాననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తాను ఎంతో మందిని చూస్తున్నానని.. ఇబ్బందులతోవారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం.. నేరస్తులు, సంఘవిద్రోహక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అస్సలు రాజీ పడవద్దని సూచించారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండాలని.. మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top